టంగ్ స్లిప్ అయ్యి.. కవర్ చేయడానికి కష్టపడ్డ రోజా

టంగ్ స్లిప్ అయ్యి.. కవర్ చేయడానికి కష్టపడ్డ రోజా

ఫైర్‌ బ్రాండ్‌ రోజా మిస్‌ ఫైర్‌ అయ్యారు. మరోసారి తొందరపడి టంగ్ స్లిప్పయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై అత్యుత్సాహం ప్రదర్శించి చివరకు నాలుక్కరుచుకున్నారు. ఎన్నికలు వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం వెల్లడించిన కొద్దిసేపటికే మీడియా ముందుకొచ్చి అద్భుతమంటూ హడావిడి చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుందంటూ వంద శాతం సమర్థిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్నట్టున్నారు. పొరపాటును సరిదిద్దుకునేందుకు మళ్లీ నాలుక మడతేశారు. చంద్రబాబు, టీడీపీయే కారణమంటూ విమర్శలు చేశారు.

Tags

Next Story