తెలంగాణ అసెంబ్లీలో 25 పద్దలుపై చర్చ

తెలంగాణ అసెంబ్లీలో 25 పద్దలుపై చర్చ
X

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చలు పూర్తయ్యాయి. మొత్తం 25 పద్దలుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చలో 25 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు. పద్దులపై చర్చకు పది మంది మంత్రులు సమాధానం ఇచ్చారు. బడ్జెట్‌లో చర్చ సందర్భంగా రాబోయే ఐదేళ్లలో 50 వేల కోట్లతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌ ప్రధాన ఆర్ధిక చోదక శక్తిగా ఉందన్నారు. ఈ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. శివారు ప్రాంతాల్లోనూ.. ఐటీని విస్తరిస్తామన్నారు మంత్రి కేటీఆర్‌.

ఇక ప్రాజెక్ట్‌లపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి హరీష్‌ సమాధానం చెప్పారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లు దేశానికి దిశానిర్దేశంగా మారాయన్నారు. తెలంగాణ ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కీర్తిస్తున్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి అడిగి తెలుసుకుంటున్నారన్నారు మంత్రి హరీష్‌.

మరోవైపు తాగునీటి అంశంపై సభలో చర్చ జరిగింది. గత కాంగ్రెస్‌ హయంలో.. తాగునీటి కోసం జనం తీవ్ర ఇబ్బందులు పడేవారని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. తాగునీటి అంశంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు.

అయితే మంత్రి సమధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ విపక్షనేత భట్టవిక్రమార్క. తాగునీటి సరఫరాపై.. కేసీఆర్‌ సర్కారు గొప్పులు చెప్పుకుంటుందని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దయనీయంగా ఉందంటూ ఆరోపించారు.

మొత్తానికి.. విద్య, క్రీడలు, టూరిజం, కార్మిక, దేవాదాయ, అటవీ, న్యాయ, పరిశ్రమలు, ఐటీ, పురపాలక, నీటిపారుదల, సాధారణ పరిపాలన పంచాయతీ రాజ్‌, ఆర్‌ అండ్‌ బీ పద్దులకు ఆమోదం లభించింది.

Tags

Next Story