బీజేపీ నేత ఆదినారాయణరెడ్డిపై కేసు నమోదు

కడప జిల్లా జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో మాజీమంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డిపై కేసు నమోదైంది. ఆయనతో పాటు 84 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నెల 14న రాత్రి దేవగుడిలో జరిగిన దాడి ఘటనపై పోలీసులు కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో చిలంకూర్ గ్రామానికి చెంది మత్తరాశి రెడ్డయ్య, అతని సోదరుడు రామాంజనేయులు తలపై గాయాలయ్యాయి.
ఈ నేపథ్యంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ ముందు బైటాయించారు. ఈ నేపథ్యంలో బాధితుని ఫిర్యాదు మేరకు బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ రెడ్డి, జయరామిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి సహా మరో 80 మందిపై.. 143, 144, 147, 148 సెక్షన్లతో పాటు.. 323, 342, 307, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com