భారత్‌లో మరో కరోనా మృతి

By - TV5 Telugu |17 March 2020 3:13 PM GMT
భారత్‌ను కరోనా వణికిస్తోంది. కరోనా కారణంగా మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో మనదేశంలో కరోనా మృతుల సంఖ్య మూడుకు పెరిగింది. ఢిల్లీలో ఒకరు, మహరాష్ట్రలో ఒకరు మృతి చెందగా.. మంగళవారం మహారాష్ట్రలో 64 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ప్రస్తుతం భారత్‌లో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది.. మంగళవారం ఒక్క రోజే 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 128కి చేరింది. ఒడిశాలో మొదటి కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి వచ్చిన ఓ యువకునికి కరోనా సోకినట్లు గుర్తించారు. అతన్ని క్యాపిటల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అతని పరిస్థితి మెరుగ్గా ఉందని, ఎలాంటి కాంప్లికేషన్స్ లేవని వైద్యులు తెలిపారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com