ఆంధ్రప్రదేశ్

కాకినాడలో కరోనా లక్షణాలతో మహిళ మృతి!

కాకినాడలో కరోనా లక్షణాలతో మహిళ మృతి!
X

ఏపీని కూడా కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటివరకు అక్కడ ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా.. తాజాగా కరోనా లక్షణాలతో ఓ మహిళ మృతిచెందినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చింది. ఆమె కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో.. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే, చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతిచెందింది. అయితే, ఇది కరోనా మరణం కాకపోవచ్చని.. మెదడువాపు వ్యాధితో మరణించి వుండవచ్చని డాక్టర్లు చెప్పారు.

కరోనా వ్యాప్తి పట్ల పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విభాగం ప్రజలకు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తోంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, పరిశుభ్రమైన దుస్తులు ధరించాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని పలు సూచనలు చేశారు అధికారులు.

Next Story

RELATED STORIES