మలేషియా ఎయిర్ పోర్టులో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు

మలేషియా ఎయిర్ పోర్టులో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు

దాదాపు 150 మంది భారతీయ విద్యార్థులు మలేషియా ఏయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. వీళ్లంతా ఫిలిప్పీన్స్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో అక్కడంతా షట్‌డౌన్ చేశారు. 72 గంటల్లోగా విదేశీ విద్యార్థులంతా వారి సొంత దేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో ఇండియన్ స్టూడెంట్స్ అంతా ఫిలిప్పీన్స్‌ నుంచి మలేషియా ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. భారత్ వచ్చేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే మాలేషియాలోనూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. విమానాలను భారీగా తగ్గించారు. దీంతో ఏం చేయాలో తెలియక ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు భారతీయ విద్యార్థులు. ఎలాగైనా తమను ఇండియా తీసుకురావాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story