కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేదాని కంటే.. రాష్ట్రం నుంచి కేంద్రానికే ఎక్కువ వెళ్తుంది: కేసీఆర్

కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేదాని కంటే.. రాష్ట్రం నుంచి కేంద్రానికే ఎక్కువ వెళ్తుంది: కేసీఆర్

దేశాన్ని పోషిస్తున్న నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానిది మొదటి స్థానమని అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకుంటూనే.. దేశాభివృద్ధికి పాటుపడుతోందని తెలిపారు. రాష్ట్రానికి పెద్దయెత్తున నిధులు మంజూరు చేస్తామని చెబుతున్న కేంద్రం మాటల్లో నిజం లేదన్నారు. రాష్ట్రం నుంచే కేంద్రానికి గణనీయంగా ఆదాయం వెళ్తోందని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లలో.. తెలంగాణ పన్నుల రూపంలో కేంద్రానికి 2 లక్షల 72 వేల 926 కోట్లు చెల్లించిందని అన్నారు. కానీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆదాయం మాత్రం లక్షా 12 వేల 854 కోట్లు మాత్రమేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story