సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

ఈ నెల 6న ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారంతో ముగిశాయి. వాస్తవానికి బీఏసీలో ఖరారైన షెడ్యూల్ కంటే నాలుగురోజుల ముందే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. కరోనా ప్రభావంతో అసెంబ్లీ సమావేశాలను కుదించింది తెలంగాణ ప్రభుత్వం. ఎనిమిది రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో ఆరు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. కేంద్రం తీసుకువచ్చిన ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్ సవరణ చట్టాన్ని ఆమోదించే తీర్మానంతో పాటు సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీన్మానం చేసింది. ఇక అసెంబ్లీ ఆమోదించిన ఆరు బిల్లుల్లో లోకాయుక్త బిల్లుకు సవరణ చేస్తూ చైర్మన్ గా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కు బదులు రిటైర్డ్ జస్టిస్ ను నియమించుకునేలా సవరణ చేస్తూ బిల్లు చేసింది. కార్పొరేషన్ చైర్మన్ల పదవులను లాభదాయక పదవుల నుంచి మినహాయిస్తూ తెచ్చిన బిల్లును కూడా సభ ఆమోదించింది. అభయహస్తం పథకం రద్దు చేసిన చట్టాన్ని ఉపసంహరించుకొనే చట్టాన్ని ఆమోదించడంతో పాటు జిఎస్టీ చట్ట సవరణకు కూడా సభ ఆమోదం తెలిపింది.
సమావేశాల చివరిరోజు సీఏఏ కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసిన ప్రభుత్వం, సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే అంశంపై సభలో కేసీఆర్ పూర్తి స్పష్టతనిచ్చారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మజ్లీస్ తో పాటు కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది.
అంతకు ముందు ప్రసంగించిన బీజేపీ ఎమ్మల్యే రాజాసింగ్.. సీఏఏ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే రాజీనామా చేసి.. తెలంగాణ నుంచి వెళ్లిపోతానని ప్రకటించారు. ఎవరికి అన్యాయం జరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో 2020-21ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఆమోదించారు. ఆర్థికమాంద్యం ఉన్నా.. అన్ని ఇబ్బందులను అధిగమించామనని తెలిపింది ప్రభుత్వం. అయితే అంకెల గారడీతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. రోజులుసాగిన బడ్జెట్ సమావేశాలు తెలంగాణ అభివృద్ధికి దోహదపతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ కేటాయింపులు చేయడంతో ప్రభుత్వం విఫలమయిందని విపక్షాలు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com