ఎన్నికలు కేంద్ర భద్రతా బలగాల మధ్య నిర్వహించాలి: యనమల
By - TV5 Telugu |17 March 2020 4:48 PM GMT
ఏపీలో స్థానిక సంస్థలకు రీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ సీనియర్ నేత యనమల డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికలను కేంద్ర బలగాల భద్రత మధ్య నిర్వహించాలని కోరారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న జగన్ సీఎం పదవికి అనర్హుడని అభిప్రాయపడ్డారు. వెంటనే సీఎంపై రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఈసీని అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికలకు 14వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధం లేదని యనమల స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com