ఏపీలో ఆగని వైసీపీ అరాచకాలు

ఏపీలో వైసీపీ అరాచకాలు ఆగడం లేదు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజవర్గంలోని చాగలమర్రిలో టీడీపీ MPTC అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవాలని వైసీపీ నేతలు బెదిరింపులకు దిగారు. అందుకు నిరాకరించడంతో అధికార పార్టీ నేతల అండతో పోలీసులు .. టీడీపీ అభ్యర్థి కుమారుల ఇళ్లలో సోదాలు దిగారు. వారి దగ్గర మద్యం సిసాలు దొరికాయంటూ వారిని అరెస్ట్ చేశారు. వారిని పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చి.. వేధింపులకు గురిచేశారు..
అటు కులం పేరుతో వారిని దూషించి అవమానపరిచారు. దీంతో మనస్తాపానికి గురై స్టేషన్‌లోనే అరెస్ట్ కాబడిన వ్యక్తి కుమారులు తమతో తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న మాజీ మంత్రి అఖిల ప్రియ వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయించారు. టీడీపీకి సంబంధించిన వారిని వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టినా.. కార్యకర్తలకు తాము అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com