కరోనా ఎపెక్ట్.. కోళ్లు ఫ్రీ

కరోనా ఎపెక్ట్.. కోళ్లు ఫ్రీ

కరోనా వైరస్‌ విజృంభన.. కోళ్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. చికెన్‌ తింటే కరోనా వస్తుందనే వదంతులు వ్యాపించడంతో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. గిరాకి తగ్గడంతో ధరలూ నేలచూపు చూస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిన్న మొన్నటి వరకు 25 రూపాయలకే కోడిని విక్రయించారు. ధరలను భారీగా తగ్గించి కోళ్లను అమ్మినా.. కొనేటోళ్లు లేరు. దీంతో ఇక చేసేది లేక ఉచితంగానే కోళ్లను పంపిణీ చేస్తున్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక పట్ణణంలో ఒక వ్యాపారవేత్త సుమారు 2వేల కోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. చికెన్‌ తింటే కరోనా రాదు అనే అవేర్‌నెస్‌ కోసం..ఇలా కోళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామంటున్నారు వ్యాపారులు. చికెన్‌ తింటే కరోనా వస్తుందనే దుష్ప్రాచారాన్ని నమ్మొద్దంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story