హైదరాబాద్‌లో కరోనా ఎఫెక్ట్.. హాస్టళ్లను తక్షణమే ఖాళీ చేయాలంటూ నోటీసులు

హైదరాబాద్‌లో కరోనా ఎఫెక్ట్.. హాస్టళ్లను తక్షణమే ఖాళీ చేయాలంటూ నోటీసులు

కరోనా కట్టడికి హైదరాబాద్‌లో మరిన్ని ముందస్తు చర్యలు చేపట్టారు. హాస్టళ్లను తక్షణమే ఖాళీ చేయాలంటూ GHMC నోటీసులు జారీ చేసింది. నగరంలోని S.R నగర్, అమీర్‌పేట్ ప్రాంతాల్లో 500కుపైగా లేడిస్, జెంట్స్ హాస్టళ్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడ ఉంటూ.. కంప్యూటర్ కోర్సులు అభ్యసిస్తుంటారు.

హాస్టల్ రూమ్‌లు చాలా ఇరుగ్గా ఉంటాయి. బెడ్స్‌ కూడా ఆనుకొని ఉంటాయని కాబట్టి వైరస్‌ వ్యాప్తికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే తక్షణమే ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. అయితే ఇప్పటికిప్పుడు వెళ్లిపోవాలంటే ఎలా అని వాపోతున్నారు విద్యార్థులు, ఉద్యోగులు. ప్రభుత్వమే తమకు ఎక్కడైనా ఆశ్రయం కల్పించాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story