ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కరోనా కలకలం

కర్నూలు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కరోనా కలకలం
X

కరోనా కట్టడికి ఏపీలో అధికారులే కాదు.. ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తమయ్యారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప.. జిల్లాల నుంచి కార్యకర్తలు, నాయకులు రావొద్దని పార్టీ శ్రేణులకు టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు సహా అందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. 100 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతై పార్టీ కార్యాలయంలోకి అనుమతించకూడదని నిర్ణయించారు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు సిబ్బందికి వివరించారు.

కరోనాకు పారాసిటమాల్‌ సరిపోతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్తుంటే.. అక్కడి జైళ్ల శాఖ మాత్రం పద్ధతిగా ముందుకుపోతోంది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు తమ వంతు బాధ్యతగా జైళ్ల శాఖలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి ములాఖత్‌లు, ఇంటర్వ్యూలు బంద్‌ చేస్తున్నట్టు ఏపీ జైళ్ల శాఖ డీజీ మెహ్మద్ రెజా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ములాఖత్‌ బదులు.. ఖైదీలు తమ కుటుంబ సభ్యులతో వారానికి నాలుగు సార్లు టెలిఫోన్‌లో మాట్లాడుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.

ఇదిలావుంటే, కర్నూలు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. ఓ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు ఇటీవలే విదేశాల నుంచి వచ్చాడు. కరోనా అనుమానిత లక్షణాలు బయటపడటంతో అతన్ని అసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో డీజీఓలో శుభ్రతా చర్యలకు జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆగమేఘాలమీద కార్యాలయాన్ని శుభ్రం చేశారు సిబ్బంది.

Next Story

RELATED STORIES