కరోనాపై కేంద్రం నిర్దేశించిన 15 జాగ్రత్తలు

సెకండ్ స్టేజ్ లోనే కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. వైరస్ కట్టడికి ప్రభుత్వ చర్యలకు మించి ప్రజల సహకారం అవసరం అవటంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలను సూచిస్తోంది. కరోనా బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలో కొన్ని గైడ్ లైన్స్ ను ప్రకటించింది.
1. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలను మూసివేయాలి
2. సమావేశాలు సాధ్యమైనంత మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలి.
3. అన్ని రెస్టారెంట్లలో చేతులు శుభ్రం చేసుకొనే ప్రొటోకాల్ అమలుచేయాలి
4. కరచాలనం, కౌగిలించుకోవడం వంటి సంప్రదాయాలకు దూరంగా ఉండాలి
5. ఆన్‌లైన్ వస్తువులను డెలివరీ చేసే వారికి తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలి
6. ప్రభుత్వం ప్రజలకు నిరంతరంగా సమాచారాన్ని అందించాలి
7. పరీక్షలు వాయిదా వేయడానికి ప్రయత్నించాలి
8. మతపరమైన కార్యకలాపాలు, సభల్లో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనకూడదు
9. ప్రజలకు అత్యవసరమైన ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలు బహిరంగంగా ప్రదర్శించాలి
10. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే వీలు కల్పించేలా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలి
11. ఇప్పటికే నిర్ణయించిన పెళ్లిళ్లలో జనం పరిమితంగా ఉండేలా చూసుకోవాలి
12. క్రీడా కార్యక్రమాలు, పోటీలను వాయిదా వేసుకోవడం మంచిది
13. వ్యాపార సంస్థలు తమ దగ్గరకు వచ్చే వినియోగదారుల మధ్య మీటరు దూరం ఉండేలా చేయాలి
14. కోవిడ్ -19 విషయంలో ఆసుపత్రులు ప్రొటోకాల్ అనుసరించాలి
15. అనవసరమైన ప్రయాణాలు రద్దుచేసుకోవాలి
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com