తెలంగాణ రైతులకు శుభవార్త.. రుణమాఫీ జాబితా విడుదల

తెలంగాణ రైతులకు శుభవార్త.. రుణమాఫీ జాబితా విడుదల

తెలంగాణలో రైతు రుణమాఫీ జాబితా విడుదల చేసింది కేసీఆర్‌ సర్కారు. 2014 ఏప్రిల్‌ 1 నుంచి 2018 డిసెంబర్‌ 11 వరకు.. రుణాలు తీసుకుని ఉంటే.. ఆ మొత్తాన్ని మాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కుటుంబానికి లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయనుంది. 25 వేల లోపు రుణం ఉన్నవారికి ఒకే దఫాలతో మాఫీ చేస్తుండగా లక్ష వరకు ఉన్న రుణాన్ని నాలుగు విడతల్లో మాఫీ చేయాలని ఈ మర్గదర్శకాల్లో వివరించింది. 2014 ఏప్రిల్‌ ఒకటి తర్వాత తీసుకున్న రీ షెడ్యూల్‌ చేసుకున్న రుణాల్లో బకాయిలు మాఫీ చేయన‌ుంది.

రైతులకు చెక్కుల ద్వారా రుణమాఫీ మొత్తానికి అందించనుంది కేసీఆర్ ప్రభుత్వం . ఇక త్వరలోనే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చెక్కులను పంపిణీ చేయనున్నారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు రుణ మాఫీ వస్తుందని ఆశగా ఎదురు చూసిన రైతులు సంతోషంలో ఉన్నారు. రైతులకు చెక్కుల ద్వార రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం అందించనుంది.

Tags

Read MoreRead Less
Next Story