ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేసిన కవిత

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ లో టీఆర్ఎస్ నేతలతో కలిసి ఆమె నామినేషన్ వేశారు. కాగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌లో కవిత తన నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, గంప గోవర్ధన్, సురేందర్ తదితరులు ఉన్నారు. అంతకుముందు హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు కవిత.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్, బీజేపీ బరిలో నిలిచినప్పటికీ.. టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం 824 ఉన్నాయి. ఇందులో టీఆర్‌ఎస్‌కు 592 ఓట్లుండగా, కాంగ్రెస్ ఓట్ల సంఖ్య 142, అలాగే బీజేపీకి 90 ఓట్లున్నాయి. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్ 7న పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com