ఎమ్మెల్సీగా బరిలో దిగనున్న కల్వకుంట్ల కవిత?

X
By - TV5 Telugu |18 March 2020 2:47 PM IST
నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్.. దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. కవిత బుధవారం నామినేషన్ వేస్తారని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన కవిత.. ఆ తర్వాత రాజకీయంగా యాక్టివ్‌గా కనిపించలేదు. ఆమెను రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగినప్పటికీ.. తుది జాబితాలో ఆమె పేరు కనిపించలేదు. ఇప్పుడు కవిత ఎమ్మెల్సీగా బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. కవిత ఎమ్మెల్సీ అయితే.. రాష్ట్ర రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com