నా కొడుక్కి చివరిసారిగా అవి తినిపించాలని ఉంది : వినయ్ శర్మ తల్లి

నా కొడుక్కి చివరిసారిగా అవి తినిపించాలని ఉంది : వినయ్ శర్మ తల్లి

ఢిల్లీలో ఘోరమైన అత్యాచారం, హత్య కేసులో నిందితులను శుక్రవారం ఉరితీయడానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. నలుగురు నిందితులకు మరణశిక్ష విధించడానికి తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నలుగురు దోషులకు ఎటువంటి న్యాయపరమైన అవకాశాలు లేవని కోర్టు చెప్పడంతోనే ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. నలుగురు దోషుల ఉరిశిక్షలను నిలిపివేయాలని కోరిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం తిరస్కరించింది.

ఈ నేపథ్యంలో నిందితులను ఉరితీయాలని తీహార్ జైలు అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే తలారి కూడా తీహార్ జైలుకు చేరుకున్నారు. సరిగ్గా ఉదయం 5 గంటల 30 నిమిషాలకు నలుగురిని ఒకేసారి ఉరి తీయనున్నారు. ఇదిలావుంటే నలుగురు దోషులలో ఒకరైన వినయ్ శర్మ తల్లి తన కొడుకుకు చివరిసారిగా పూరి, సబ్జి తినిపించాలని కోరుతున్నారు. అయితే అధికారులు దీనికి ఇంకా అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story