శ్రీశైలంలో విదేశీ భక్తులను వెనక్కు పంపిన ఆలయ అధికారులు
BY TV5 Telugu19 March 2020 1:55 PM GMT

X
TV5 Telugu19 March 2020 1:55 PM GMT
శ్రీశైలంలో ఇద్దరు విదేశీ భక్తులను ఆలయ అధికారులు వెనక్కు పంపించారు. ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోకుండా, మాస్క్‌లు ధరించకుండా రావడంతో వారిని టోల్‌గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మమ్మల్ని కిడ్నాప్ చేస్తారా అంటూ సెక్యూరిటీ సిబ్బందితో విదేశీయులు వాగ్వాదానికి దిగారు. అటు విదేశీయుల రాకతో భక్తులు భయాందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలంకి వచ్చిన ఈ ఇద్దరు విదేశీయులు ఇజ్రాయిల్‌కి చెందిన వారిగా గుర్తించారు.
Next Story