సీఎం స్థాయి వ్యక్తి కులం గురించి మాట్లాడడం బాధాకరం : సుజనా చౌదరి

సీఎం స్థాయి వ్యక్తి కులం గురించి మాట్లాడడం బాధాకరం : సుజనా చౌదరి

సీఎం స్థాయి వ్యక్తి కులం గురించి మాట్లాడడం బాధాకరమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ ఇష్టానుసారం మాట్లాడారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల అధికారిపై హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు వచ్చారని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం కన్నా ఎన్నికలే ముఖ్యం అనేలా ప్రభుత్వ తీరు ఉందని, ఎన్నికల అధికారికి కులాన్ని అంటకట్టడం మంచిది కాదని సూచించారు. బీజేపీ, టీడీపీ నాయకులపై దాడులు చేశారని సుజనాచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకగ్రీవం అయిన చోట్ల మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధులను కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని సుజనాచౌదరి విమర్శించారు.

Tags

Next Story