ప్యాకేజీల కోసమే కొందరు వైసీపీలో చేరుతున్నారు : మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు

ప్యాకేజీల కోసమే కొందరు వైసీపీలో చేరుతున్నారు : మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు
X

టీడీపీ కార్యకర్తలను అడ్డం పెట్టుకుని ప్యాకేజీల కోసమే కొందరు వైసీపీలో చేరుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు. విజయనగరం జిల్లా రాంబద్రపురంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలే టీడీపీకి బలమన్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రామభద్రపురం మండలంలోని పలు గ్రామాల నుంచి వైసీపీ కార్యకర్తలు సుజయ్‌ కృష్ణ రంగారావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.

Tags

Next Story