నిమ్మగడ్డ రమేష్ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుంభనంగా వ్యవహరిస్తోంది : చంద్రబాబు

నిమ్మగడ్డ రమేష్ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుంభనంగా వ్యవహరిస్తోంది : చంద్రబాబు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామ ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహానీ ఉందంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్, కేంద్రానికి లేఖ రాశారని చంద్రబాబు గుర్తు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కోరిన విధంగానే కేం ద్ర ప్రభుత్వం సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో భద్రత కల్పించారని చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుంభనంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు వ్యవస్థలంటే లెక్కలేకుండాపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటుగా విమర్శించారు. ఎన్నికల సంఘం నిర్ణయాలను కూడా ఖాతరు చేయడం లేదని మండిపడ్డారు. కరోనా వైరస్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలని హితవు పలికారు.

Tags

Next Story