ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి బ్రేక్..

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి బ్రేక్..

ఏపీలో కరోనా వైరస్ కారణంగా ఇళ్లపట్టాల పంపిణీకి బ్రేక్ పడింది. శుక్రవారం ఉదయం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ నివారణకు చర్యలు తీసుకుంటున్నందున ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తిరిగి ఏప్రిల్‌ 14న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.

Tags

Next Story