ఆంధ్రప్రదేశ్

అమరావతి ఉద్యమంపై కరోనా ఎఫెక్ట్

అమరావతి ఉద్యమంపై కరోనా ఎఫెక్ట్
X

అమరావతి ఉద్యమంపైనా కరోనా ఎఫెక్ట్ పడింది. శనివారం నుంచి దీక్షలు వద్దని అధికారులు సూచించిన నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై రైతులు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే ఎండలు మండుతున్నా లెక్కచేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షా శిభిరాల్లోనే ఉంటున్న రైతులు, రైతు కూలీలు, మహిళలు 100వ రోజు ఉద్యమం సందర్భంగా ఏం చేయాలనే దానిపైనా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 26న ర్యాలీలు, ఇతరత్రా కార్యక్రమాలకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇంతలో కరోనా రూపంలో ఉద్యమానికి ఆటంకం ఏర్పడడంతో.. శుక్రవారం రైతులంతా సమావేశం కానున్నారు. అందరి అభిప్రాయం తీసుకున్నాక ఒక నిర్ణయం ప్రకటించనున్నారు.

Next Story

RELATED STORIES