ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు..
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండో పాజిటీవ్ కేసు నమోదైన 24 గంటలలోపే మరొకరికి కరోనా పాజిటీవ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల మక్కా నుంచి విశాఖకు వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో.. ఆసుపత్రిలో చేరారు. ఆయన శాంపిల్స్‌ను పరీక్షలకు పంపగా.. కరోనా ఉన్నట్లు నిర్ధారించారు వైద్యులు. ప్రస్తుతం చెస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందతున్నాడు. దీంతో.. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మూడుకు పెరిగాయి. విశాఖలోనే మరో ఆరు అనుమానిత కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి రక్త నుమానాలను పరీక్షలకు పంపారు. రిపోర్టు రావాల్సిన ఉందని వైద్యులు తెలిపారు
అటు.. విజయనగరంలో జిల్లాలోనూ కరోనా అనుమానిత కేసు నమోదైంది. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ మీదుగా విజయనగరం వచ్చిన వ్యక్తిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. రక్త నమూనాలను పరీక్షకు పంపారు వైద్యులు. నెల్లూరులో తొలి కరోనా కేసు నమోదవగా, ఒంగోలులో రెండో పాజిటీవ్ కేసు నమోదైంది.
కరోనాతో కొంపలు మునిగిపోయేదేమి లేదంటూ చెప్పుకుంటూ వచ్చిన ప్రభుత్వం.. ముప్పు ముంచుకొస్తుండటంతో తీరిగ్గా అప్రమత్త చర్యలు చేపట్టింది. ఇంటా బయట విమర్శలతో కాస్త ఆలస్యంగానైనా స్కూల్స్ ను బంద్ రద్దు చేశారు. లేటెస్ట్ గా మాల్స్, థియేటర్స్ కూడా మూసివేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
ఇక, కౌలాలంపూర్ నుంచి వచ్చిన 186 మంది విద్యార్దులకు కరోనా అనుమానిత పరీక్షలు నిర్వహించారు. ఈ విద్యార్ధులందరిని నాలుగు కేటగిరీలుగా విభజించారు. 14 రోజులు పాటు ఐసోలేషన్‌లో ఉంచాలని వైద్యులు సూచించడంతో.. వీళ్లను వివిధ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ జోన్లకు తరలించారు. విదేశాల నుంచి వచ్చే కరోనా అనుమానితులకు విశాఖలో చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యవిద్యాసంస్ధల్లో క్వారంటైన్ సదుపాయాలు ఏర్పాటుకు రంగం సిద్దం చేయనున్నట్లు మంత్రి అవంతీ శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం విమ్స్ లో 500 పడకలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విశాఖ కలెక్టరేట్ లో కరోనాపై జిల్లా కలెక్టర్, డిఎంహెచ్ఓ లతో పాటు ఇతర వైద్యాధికారులతో సమావేశం నిర్వహించిన అవంతి శ్రీనివాస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాలను ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com