విజయవాడ అమ్మవారి గుడిలో మార్చి 31 వరకు సేవలు నిలిపివేత

విజయవాడ అమ్మవారి గుడిలో మార్చి 31 వరకు సేవలు నిలిపివేత

కరోనా వైరస్‌ విజృంభిస్తున్నందున విజయవాడ కనకదుర్గ గుడిలో మార్చి 31 వరకు అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు ప్రకటించారు. దీంతో అమ్మవారి అంతరాలయ దర్శనాలు రద్దు కానున్నాయి. కేశ ఖండనశాలను, అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లే బస్సులను, లిఫ్టులను నిలిపివేశామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు శానిటైజేషన్‌ లిక్విడ్‌ అందజేస్తున్నామని తెలిపారు. ఉగాది రోజు పంచాగశ్రవణం ఉంటుందని, కానీ అమ్మవారి సేవలకు భక్తులకు అనుమతి లేదన్నారు. అమ్మవారికి జరిగే సేవలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Tags

Next Story