ట్రైన్‌లో కాల్పుల కలకలం

ట్రైన్‌లో కాల్పుల కలకలం

ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న జిటీ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో కాల్పుల కలకలం రేపింది. క్యాంటీన్‌ మేనేజర్‌పై ఓ కానిస్టేబుల్‌ ఈ కాల్పులు జరిపాడు. వరంగల్‌, ఖమ్మం మార్గ మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులతో బుల్లెట్ తగిలి క్యాంటీన్‌ మేనేజర్‌ సునీల్‌ సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని ముందుగా ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.

జిటీ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ క్యాంటీన్‌ మేనేజర్‌ సునీల్‌ సింగ్‌కి, రైలులో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బందికి మద్య ఘర్షణ తలెత్తింది. చిన్న వివాదం కాస్త పెద్దగా మారింది. దీంతో సహనం కోల్పోయిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ తన వద్ద ఉన్న తుపాకీతో.. క్యాంటీన్‌ మేనేజర్‌పై కాల్పులు జరిపాడు. బుల్లెట్‌ తగడంతో అతనికి గాయాలయ్యాయి. దీనిపై రైల్వే పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story