నిర్భయ దోషుల ఉరితో దేశంలో సంబరాలు

నిర్భయ దోషుల ఉరితో దేశంలో సంబరాలు

నిర్భయ దోషులకు ఉరి తర్వాత దేశంలో పలు చోట్ల జనం సంబరాల్లో మునిగిపోయారు. ఇక నిర్భయ ఇంటి దగ్గర పండగ వాతావరణం నెలకొంది. జనం పెద్ద ఎత్తున వచ్చి డ్యాన్సులు చేశారు. నిర్భయ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు.

ఇన్నాళ్ల న్యాయపోరాటం తర్వాత నీకు న్యాయం జరిగిందంటూ నిర్భయ ఫోటో పట్టుకొని కన్నీరు పెట్టుకుంది ఆమె తల్లి ఆశాదేవి. నిర్భయతో మొదలైన తన పోరాటం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని.. నిర్భయ తరహా బాధితుల తరపున నిలబడతామని అన్నారామె.

నిర్భయ ఘటనతో నైనా చట్టంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు ఢిల్లీ సీఎం కేజ్రివాల్. శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు ఎన్ని రకాల ప్రయత్నం చేశారో చూశామని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునారవృతం కాకుండా ఈ రోజు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు కేజ్రీవాల్.

Tags

Read MoreRead Less
Next Story