కరోనా మహమ్మారిపై యుద్ధం ప్రకటించిన మోదీ సర్కార్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై మోదీ సర్కారు యుద్ధం ప్రకటించింది. 130 కోట్ల మంది భారతీ యులతో కలసి కరోనా వైరస్‌ను నియంత్రించడానికి కార్యాచరణ ప్రకటించింది. కరోనాను తరిమేయడానికి జనతా క ర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చింది. ఈనెల 22 ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నవేళ ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా విషయంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకూడదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కొన్ని వారాలు అలర్ట్‌గా ఉండాలని, అత్యవసరం ఉంటే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని చెప్పారు.
కరోనాతో ఆర్థికంగా కూడా తీవ్ర నష్టం కలుగుతుందని మోదీ అంగీకరించారు. వైరస్ తీవ్రత కారణంగా వర్తక, వ్యాపార కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందని మోదీ చెప్పారు. ఐనప్పటికీ ప్రజల భద్రత దృష్ట్యా కొన్ని చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ వ్యాధికి ఇప్పటి వరకు ఎలాంటి మందు కనిపెట్టలేదని, వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదని మోదీ తెలిపారు. కొద్ది వారాలు అందరి సమయం తనకు ఇవ్వాలని కోరారు మోదీ. అందరూ చేయి చేయి కలిపి ఈ విపత్తును ఎదుర్కోవాలన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com