బిగ్ బ్రేకింగ్.. నిర్భయకేసులో దోషులకు ఉరిశిక్ష

బిగ్ బ్రేకింగ్.. నిర్భయకేసులో దోషులకు ఉరిశిక్ష

ఎట్టకేలకు నిర్భయకేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. ఢిల్లీలో తీహార్ జైలులో శుక్రవారం 5.30 గంటలకు నలుగురు దోషుల్ని.. తలారీ పవన్‌ జల్లాద్‌... ఉరితీశాడు. ఉరి అమలు చేసే సమయంలో జైలు సూపరిండెంట్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌, మెడికల్‌ ఇంఛార్జ్‌ ఆఫీసర్‌, రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీస్‌, జిల్లా మెజిస్ట్రేట్‌ సహా పలువురు పోలీసులు అధికారులు ఉన్నారు. అంతుకు ముందు నలుగిరికి వైద్య పరీక్షలు చేశారు. అందరి ఆరోగ్య పరిస్థితి బాగుందని నిర్ధారించిన తర్వాత... ఉరి అమలు చేసినట్లు తెలిపారు అధికారులు. ఈ నలుగురికి ఉదయం 8 గంటల సమయంలో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఒకేసారి నలుగురిని ఉరి తీయడం తీహార్‌ జైల్లో ఇదే తొలిసారి. చివరిసారిగా ఉగ్రవాది అప్జల్‌గురుని ఉరి తీశారు. అనంతరం.. ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ ఉరిశిక్ష అమలు చేశారు. దోషుల్ని ఉరితీయడంతో.. నిర్భయ కేసులో న్యాయం చేసినట్లైంది.

Tags

Read MoreRead Less
Next Story