ఏపీ ఈసీ రమేష్ కుమార్‌కు భద్రత పెంపు

ఏపీ ఈసీ రమేష్ కుమార్‌కు భద్రత పెంపు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌‌కు గురువారం నుంచి భద్రత పెంచారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తరువాత వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రమేశ్ కుమార్‌కు 1+1 నుంచి 4+4కి ప్రభుత్వం నిఘా పెంచింది. ఉదయం నుంచి 4+4 సెక్యూరిటీ విధుల్లో చేరింది.

తన ప్రాణానికి రక్షణ లేదంటూ బుధవారం కేంద్ర హోం శాఖకు రమేష్ కుమార్ లేఖ రాసినట్టు ప్రచారం జరిగింది. అయితే తరువాత ఆయన లేఖ రాయిలేదంటూ మరో ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ.. కేంద్రం భద్రత పెంచింది.

Tags

Next Story