రేపు ఉదయం 6 గంటలనుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు తెలంగాణలో జనతా కర్ఫ్యూ : సీఎం కేసీఆర్

రేపు ఉదయం 6 గంటలనుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు తెలంగాణలో జనతా కర్ఫ్యూ : సీఎం కేసీఆర్

రేపటి జనతా కర్ఫ్యూ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.

విదేశాల నుంచి వచ్సిన వారు తమంతట తాము వచ్చి వైద్యులను సంప్రదించాలని సూచించారు.. అటువంటి వారు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు ముఖ్యమంత్రి. తెలంగాణలో మొత్తం 21 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని అన్నారు. కరోనా కంట్రోల్ కోసం 5274 నిఘా బృందాలు పని చేస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. గ్రామ సర్పంచులు ఇతర అధికారులు విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. జనతా కర్ఫ్యూలో దేశానికీ తెలంగాణ ఆదర్శంగా ఉండాలని.. అందులో భాగంగా రేపు ఉదయం 6 గంటలనుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ లో పాల్గొనాలని ప్రజలను కోరారు.

ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రతి డిపోలో అవసరార్ధం ఐదు బస్సులను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. అయితే ఇవి కేవలం అవసరం అయితే తప్ప తిరగవని స్పష్టం చేశారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను కూడా రానివ్వమని తేల్చి చెప్పారు. అన్ని రాష్ట్రాలు కూడా ఇది పాటించాలని సూచించారు. మెట్రో రైల్లు కూడా క్లోజ్ చేసినట్టు తెలిపారు. అయితే ఐదు ట్రైన్స్ మాత్రం అందుబాటులో ఉంటాయని చెప్పారు. వీటిని కూడా ఎమర్జెన్సీ కోసమే కొనసాగిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజానీకం ఈ కర్ఫ్యూలో పాల్గొనాలని తద్వారా రాష్ట్రానికి, దేశానికీ, ప్రపంచానికి మంచి చెయ్యాలని కోరారు. రేపు కేవలం అత్యవసర సిబ్బంది మాత్రమే పని చేస్తారని.. మిగిలిన వాళ్ళందరూ వాలంటీర్ గా తమ పనులను క్లోజ్ చెయ్యాలని సూచించారు.

ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే కర్ఫ్యూను కచింతంగా పాటించాలని చెప్పారు. మహారాష్ట్ర బార్డర్ ను కూడా క్లోజ్ చేసే విషయాన్నీ కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. మహారాష్ట్రలో కరోనా జబ్బు ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా ఇటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఇక మీడియా వాళ్ళు జాగ్రత్తలు పాటించాలని.. ఒక మీటర్ దూరంలో ఉండాలని ప్రజలు, మీడియా వాళ్లకు సూచించారు. 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు, 10 ఏళ్ల లోపు పిల్లలు రెండు వారాలపాటు బయటికి రాకుండా ఉండాలని సూచించారు. రోజుకు వెయ్యి మందిని పరీక్షించే ccmd ని రాష్ట్రంలో వాడుకునే విధంగా ప్రధాన మంత్రిని అడిగినట్టు చెప్పారు. మనకు మనం కాపుకుంటే అందరిని కాపాడుకున్న వాళ్ళం అవుతామని అన్నారు ముఖ్యమంత్రి.

Tags

Read MoreRead Less
Next Story