కరోనా కట్టడికి తెలంగాణలో గట్టి చర్యలు

తెలంగాణలో ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారిపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎవరెవరు వచ్చారు.. వాళ్లు ఎలా ఉన్నారనే వివరాలు సేకరిస్తున్నారు. అయితే.. అడ్రస్‌లు తప్పుగా ఉన్నాయని.. సిబ్బంది చెప్తున్నారు. మరికొందరు వివరాలు ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. దీంతో.. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వని వారిపై అధికారులు దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వేట కొనసాగుతోంది. ఇటు.. హైదరాబాద్‌లోని పాతబస్తీపైనా ఫోకస్ చేశారు. కజకిస్తాన్, దుబాయ్, ఇండోనేషియా నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com