తమిళనాడు నుంచి ఏపీకి వస్తున్న వాహనాల నిలిపివేత

తమిళనాడు నుంచి ఏపీకి వస్తున్న వాహనాల నిలిపివేత

కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. తమిళనాడు నుంచి ఏపీకి వస్తున్న వాహనాలను నిలిపివేస్తున్నారు. నిత్యావసర వస్తువులతో వెళ్లే వాహనాలు తప్ప.. మిగిలిని ఏ వాహనాన్ని కూడా చెక్ పోస్ట్ దాటనివ్వడం లేదు. కుప్పం తమిళనాడు సరిహద్దులోని వి.కోట వద్దనున్న.. బత్తలపల్లి చెక్ పోస్టును పూర్తిగా మూసివేశారు. అటు చెన్నై నుంచి తిరుపతి వైపు వచ్చే వాహనాలను ఉత్తికోట వద్ద నిలిపివేశారు. నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి వైపు వచ్చే వాహనాలను సత్యవేడు నుంచి తిప్పి పంపుతున్నారు.

Tags

Next Story