ఫుట్‌బాల్‌ దిగ్గజం కన్నుమూత.. సచిన్‌ సంతాపం

ఫుట్‌బాల్‌ దిగ్గజం కన్నుమూత.. సచిన్‌ సంతాపం

భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం, మాజీ సారథి ప్రదీప్‌ కుమార్‌ బెనర్జీ (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం కోల్‌కతాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఫిబ్రవరి 7 న ఆసుపత్రి పాలయిన ఆయన రెండు వారాలకు పైగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్ చికిత్సలో ఉన్నాడు. ఆటగాడిగా భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన బెనర్జీ.. అనంతరం కోచ్‌గా కూడా జట్టుకు తన సేవలను అందించారు. భారత్‌ తరుపున 84 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించి 65 గోల్స్‌ సాధించారు. భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పికె బెనర్జీకి నివాళులర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story