లండన్‌ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న 70మంది భారతీయులు

లండన్‌ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న 70మంది భారతీయులు

లండన్‌ ఎయిర్‌ పోర్టులో 70 మంది భారతీయులు చిక్కుకున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో ఈనెల 22 వరకే విదేశాల నుంచి వచ్చే వారిని అనుమతిస్తున్నట్టు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆలోపు స్వదేశానికి చేరుకోవడానికి 70 మంది భారతీయులు లండన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారిలో పాతిక మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

భారత ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోడంతో.. విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు లండన్‌ ఎయిర్‌ పోర్టు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వారిని భారత్‌కి పంపించడానికి నిరాకరిస్తున్నారు. తమను స్వదేశానికి పంపించాలని ఎయిర్‌పోర్టు అధికారులను ఎంత వేడుకున్నప్పటికీ లాభం లేకుండా పోయిందని సిరిసిల్లకు చెందిన శరణ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

చేసేదిలేక ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న బాధితులంతా.. లండన్‌లోని భారత ఎంబసీ కార్యాలయానికి చేరుకున్నారు. 31వ తేదీ తర్వాత రాకపోకలు కొనసాగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో 70 మంది భారతీయులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని.. తమను స్వదేశానికి చేర్చాలని వేడుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story