మోదీ మాట విందాం.. కరోనాను తరిమేద్దాం..

మోదీ మాట విందాం.. కరోనాను తరిమేద్దాం..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భరతం పట్టేందుకు భారత్ సిద్ధమైంది. రాకాసి పురుగును తరమికొట్టేందుకు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిఒక్కరూ ఉక్కుసంకల్పంతో వున్నారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు జనభారతం జనతా కర్ఫ్యూకు సిద్ధమవుతోంది. రోజు కూలీ నుంచి బడా వ్యాపారవేత్త వరకు.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు.. తర తమ భేదం లేకుండా.. కరోనాను కడతేర్చేందుకు ముందుకు వస్తున్నారు.

జనతా కర్ఫ్యూలో తాము సైతం అంటూ సోషల్ మీడియాలో నినదిస్తున్నారు జనం. ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు స్వీయ నిర్బంధం విధించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉక్కు సంకల్పంతో వున్నారు. కరోనా మహమ్మారిని తరిమేసి.. దేశాన్ని, ప్రపంచాన్ని రక్షించేందుకు కంకణం కట్టుకున్నారు. జై జనతా కర్ఫ్యూ అంటూ నినదిస్తున్నారు. కొందరు ముందస్తుగానే జనతా కర్ఫ్యూను ప్రారంభించి దేశభక్తిని చాటుకుంటున్నారు.

Tags

Next Story