జనతా కర్ఫ్యూను అందరం పాటిస్తాం : అమరావతి రైతులు
అదే నినాదం, అదే ఉక్కు సంకల్పం. ఎన్ని అవాంతరాలెదురైనా సడలని పట్టుదల. ఓవైపు ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్నా.. జాగ్రత్తలు తీసుకుంటూనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు అమరావతి రైతులు. రాజధాని రైతుల ఆందోళనలు 95వ రోజూ ఉద్ధృతంగా సాగాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లితో పాటు.. రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతుల ఆందోళనలు కొనసాగాయి. ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు, నిరసనలతో దీక్షా శిబిరాలు దద్దరిల్లాయి.
అమరావతి ఉద్యమానికి కరోనా కారణంగా స్వల్ప అంతరాయం వాటిల్లనుంది. ప్రధాని పిలుపు మేరకు ఆదివారం ఇళ్లకే పరిమితం కావాలని రైతులు నిర్వహించారు. జనతా కర్ఫ్యూను అందరం పాటిస్తామని చెబుతున్నారు. అయితే ఇళ్లలో కూడా తమ ఉద్యమం కొనసాగుతుందంని స్పష్టం చేశారు..
ప్రపంచమంత కరోనా వైరస్ గురించి భయపడతుంటే సీఎం జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున దీక్షలు జరుగుతున్నాయని తెలిసినా ఒక్క వైద్యుడిని కూడా పంపలేదన్నారు. కనీస జాగ్రత్తలు కూడా చెప్పలేదని ఆరోపించారు..ఒక వేళ దీక్షలో కూర్చున్న వారిలో ఎవరికైనా కరోనా సోకితే పరిస్థితి ఏంటని నిలదీశారు..
కరోనాను దృష్టిలో ఉంచుకొని శిబిరాల్లో పలు జాగ్రత్తలు పాటించారు రైతులు. నియమిత సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొంటున్నారు. కొన్ని శిబిరాల్లో ఒక్కొక్కరికి మధ్య 3 మీటర్ల దూరం పాటించారు. అటు రోజూ రాత్రి ఏడున్నరకి అమరావతి వెలుగు పేరుతో.. ప్రతి ఇంటిముందు కొవ్వత్తులు వెలిగించి నిరసనలు తెలుపనున్నారు. ఉద్యమం రూపుమారుతుందే కానీ.. ఉద్యమం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు రైతులు..
కరోనా నేపథ్యంలో కొంతకాలం పాటు దీక్షలు, ధర్నాలు విరమించుకోవాలని తుళ్లూరు మహాధర్నా శిబిరం సహా అన్ని శిబిరాలకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. దీంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు రైతులు. వంతులువారీగా శిబిరాల్లో కూర్చోవడంతోపాటు.. 60 ఏళ్లు పైబడినవారు, పిల్లలను ఉద్యమానికి దూరంగా ఉంచుతున్నారు. అటువందో రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై త్వరలోనే కార్యాచరణ పాటించనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com