జనతా కర్ఫ్యూకి పూర్తి మద్దతుగా రాజధాని అమరావతివాసులు
By - TV5 Telugu |22 March 2020 11:44 AM GMT
రాజధాని అమరావతివాసులు జనతా కర్ఫ్యూకి పూర్తి మద్దతుగా నిలిచారు. ఉద్యమానికి విరామం ప్రకటించాల్సి రావడం లాంటి సంకట స్థితి ఎదురైనా ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై పోరాటమే ముఖ్యమంటున్నారు. ఇవాళ 96వ రోజుకు ఉద్యమం చేరింది. ఈ నేపథ్యంలో ఉదయం ఐదున్నర నుంచి 7 గంటల వరకూ దీక్షల్లో కూర్చున్నారు. తర్వాత ఇళ్లకు వెళ్లిపోయారు. రాత్రి 9 గంటల తర్వాత జనతా కర్ఫ్యూ ముగిసాక అంతా దీక్షా శిబిరాలకు వచ్చి కాసేపు అమరావతి కోసం ఆందోళన చేపడతారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com