జనతా కర్ఫ్యూ : కరోనా కట్టడికి మేము సైతం అంటూ తెలుగు ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం
తెలుగు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది. కరోనా కట్టడికి మేము సైతం అంటూ తెలుగు ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుంచే రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. బస్సులు, మెట్రో రైళ్లు ఇప్పటికే డిపోలకు పరిమితమయ్యాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు వెలవెలబోతున్నాయి. ఎప్పుడూ జనాలతో సందడిగా ఉండే ఈ ప్రాంతాలు కర్ఫ్యూ నేపథ్యంలో నిర్మానుష్యంగా మారాయి.
తెలంగాణలో సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ప్రజలు 24 గంటల పాటు జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఈ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన జనతా కర్ఫ్యూ రేపు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ మెదక్ జిల్లాల్లోనూ జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలంతా స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొని ఇళ్లకే పరిమితం అయ్యారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వెలవెలబోతున్నాయి. కరోనా కట్టడికి మేము సైతం అంటూ జనతా కర్ఫ్యూకి మద్దతు తెలిపారు.
ఏపీలోనూ జనతా కర్ఫ్యూను విజయవంతంగా కొనసాగుతోంది.. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు నిలిపివేయగా.. పెట్రోల్ బంక్‌లు కూడా మూతపడ్డాయి. ప్రజలంతా సంపూర్ణంగా జనతా కర్ఫ్యూకు మద్దతు పలికారు. ఏపీలో పెట్రోల్ బంకులుకూడా మూసివేశారు. తెలంగాణ సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com