జనతా కర్ఫ్యూకు మద్దతు ఇవ్వాలి : నారా బ్రాహ్మణి పిలుపు

జనతా కర్ఫ్యూకు మద్దతు ఇవ్వాలి : నారా బ్రాహ్మణి పిలుపు

జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిత్యావసరమైన పాలను హెరిటేజ్ ఫుడ్స్‌‌ అందుబాటులో ఉంచుతుందని.. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి తెలిపారు. పాలసేకరణ నుంచి వినియోగదారులకు అందించేవరకు కరోనా నివారణ చర్యలు పాటిస్తున్నామని వెల్లడించారు. తమ సంస్థలో ప్రతి ఉద్యోగిని థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాతే విధుల్లోకి అనుమతిస్తున్నామన్నారు. పాలు, పెరుగు ప్యాకెట్లు ఇతర ఆహార ప్యాకెట్లు వినియోగానికి ముందు నీటితో కడిగి కత్తిరించాలని సూచించారు. వినియోగదారులు కూడా సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే ఉండి జనతా కర్ఫ్యూకు మద్దతు ఇవ్వాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు.

Tags

Next Story