జనతా కర్ఫ్యూ వల్ల ఇంటికే పరిమితమైన చంద్రబాబు

జనతా కర్ఫ్యూ వల్ల ఇంటికే పరిమితమైన చంద్రబాబు

చంద్రబాబు అంటేనే విశ్రాంతికి దూరంగా ఉండే వ్యక్తి. అధికారం ఉన్నా లేకపోయినా రోజుకు 16-18 గంటలు నాన్‌స్టాప్‌గా పనిచేస్తూనే ఉంటారు. కానీ ఆదివారం జనతా కర్ఫ్యూ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు చంద్రబాబు. పార్టీ కార్యక్రమాలన్నీ పూర్తిగా పక్కకుపెట్టేసిన ఆయన.. మనవడు దేవాన్ష్‌తో సమయం గడిపారు. ఓపక్క ఏపీలో తాజా పరిస్థితులను టీవీల ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే.. వీలైనంత టైమ్ మనవడికి కేటాయించారు. పుస్తకం చదువుతూ అందులో పాఠాలు వివరించారు. మనవడితో ఆడుకోవడం కోసం ఆయన కుర్చీ దిగి చిన్న బీన్‌బ్యాగ్ లాంటి దాంట్లో కూర్చున్నారు. ఈ తాతా మనవళ్ల సందడికి సంబంధించిన చిన్న వీడియో ఇప్పుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

Tags

Next Story