ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 17మంది పోలీసుల ఆచూకీ గల్లంతు

ఛత్తీస్‌ఘడ్ అడవి మరోసారి రక్తమోడింది. భారీ ఎన్‌కౌంటర్‌లో 17 మంది పోలీసులు మృతి చెందారు. వీరిలో 12 మంది డీఆర్జీ, ఐదుగురు ఎస్టీఎఫ్‌కు చెందినవారు. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య శనివారం అర్ధరాత్రి జరిగిన పోరులో.. కొందరి ఆచూకీ తెలియకుండా పోయింది. ఎన్‌కౌంటర్ సమయంలో గల్లంతైన పోలీసుల సంఖ్య మొదటగా 13గా తేలింది. అయితే.. మరణించిన పోలీసుల మృతదేహాలు లభ్యమైన అనంతరం వీరి సంఖ్య 17గా నిర్ధారించారు ఛత్తీస్‌ఘడ్ పోలీసులు.
సుక్మా జిల్లా కసల్పాడ్ - ఎల్మాగుడ అడవుల్లో మహోయిస్టుటుల కోసం 550 మంది భద్రతాబలగాలు వెళ్లారు. గాలింపుల్లో పోలీసులు డెడ్‌బాడీలు దొరికాయని తెలిపారు పోలీసులు. మొత్తం 17 మంది పోలీసులు మరణించిగా.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులు తమ ప్రాబల్యం పెంచుకుంటున్న చింతగుపా ప్రాంతంలోని కోర్జగూడ హిల్స్‌లో..డీఆర్జీ పార్టీకి చెందిన పోలీసులు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరిగాయి. మావోయిస్టులు కాల్పుల జరపడంతో.. వాటిని తిప్పికొట్టారు పోలీసులు.ఈ దాడిలో ఛత్తీస్‌ఘడ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది.ఎన్‌కౌంటర్‌లో 12 మందికి బుల్లెట్ గాయాలైనట్లు తెలుస్తోంది.
దేశమంతా కరోనాపై యుద్ధం చేస్తున్న తరుణంలో.. మావోయిస్టులు ఇలా రెచ్చిపోవడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మండిపడుతున్నాయి. ఎన్‌కౌంటర్ సమయంలో.. భద్రతాదళాల్లో ఎకే 47 రైఫిల్స్ అటోమెటిక్ రైఫిల్స్ లేవని అధికారులు చెబుతున్నారు. గతంలో ఏప్రిల్ 24, 2017న సుక్మాల బుర్కాపాల్ సమీపంలో మావోయిస్టులు 25 మంది సీఆర్‌పీఎప్ సిబ్బందిని హతమార్చారు. కాగా ఇప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్ రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా చెబుతున్నారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com