దేశంలో డేంజర్ బెల్ మోగిస్తోన్న కరోనా .. ఆదివారం ఒక్క రోజే ముగ్గురు మృతి
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 396 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 7కు చేరుకుంది. ఆదివారం ఒక్క రోజే ముగ్గురు చనిపోయారు. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి బులిటెన్ విడుదల చేసింది. దేశంలో 17237 మంది నుంచి 18127 నమూనాలను సేకరించి పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. శనివారం మొత్తం 79 కేసులు నమోదు కాగా..ఆదివారం 81 మంది కరోనా పాజిటివ్ వచ్చినట్లు బులిటెన్‌లో పేర్కొంది. దేశంలో కరోనా కలకలం రేపుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు ముమ్మరం చేశాయి.
ప్రధాని పిలుపు మేరకు ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇంటికే పరిమితమైపోయారు. దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. దేశంలో అతిపెద్ద రవాణ వ్యవస్థ ఇండియన్ రైల్వే కూడా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టింది. మార్చి 31 వరకు అన్ని ప్యాసింజర్ సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడవనున్నాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా కోరనా వ్యాపించిన జిల్లాలను కేంద్రం ప్రకటించింది. వైరస్ ప్రభావం ఉన్న 75 జిల్లాలను లాక్‌డౌన్ ప్రకటిస్తన్నట్లు స్పష్టం చేసింది. ఈనెల 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపింది. అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ 75 జిల్లాల జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణలోని ఐదు జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఏపీలో ముడు జిల్లాలు.. కృష్ణా, విశాఖ ప్రకాశం జిల్లాలో వైరస్ ప్రభావం అధికంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
దేశంలో అత్యధికంగా మాహారాష్ట్ర కేరళంలోని 10 జిల్లాల్లో కరోనా ప్రభావం ఉన్నట్లు తెలిపింది. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలలో పూర్తి నిషేధాజ్ఞలు అమలు చేయనున్నారు. ప్రధాని కార్యాలయానికి చెందిన క్యాబినెట్ సెక్రటరి, ప్రిన్సపల్ సెక్రటరీలు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com