కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడి మృతి

కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడి మృతి

కరోనా నుంచి కోలుకున్న ఓ వృద్ధుడు వేరే అనారోగ్య కారణాలతో ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కొద్దీ రోజులక్రితం 68 ఏళ్ల వ్యక్తి ఫిలిప్పీన్స్‌ నుంచి ముంబై వచ్చారు. ఆయన కరోనా వైరస్ భారిన పడ్డారు. దాంతో ముంబైలోని ఆసుపత్రిలో కస్బూర్బా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు 14 రోజులుగా చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలో మరోసారి పరీక్షించిన అనంతరం నెగెటివ్‌ రిపోర్ట్‌ రావడంతో ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. అయితే అతను ఆదివారం మృతి చెందినట్లు చెప్పారు. కానీ అతను కరోనా వైరస్ కారణంగా మృతించెందలేదని.. మధుమేహం, ఆస్త్మా, శ్వాసకోశ ఇబ్బందులతోనే మృతి చెందారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Tags

Next Story