సీఎం జగన్‌కు లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు
కరోనా వ్యాధి నియంత్రణ, ఉపాధి కోల్పియన పేద కుటుంబాలనుకు ఆదుకోవాలంటూ... టీడీపీ అధినేత చంద్రబాబు... సీఎం జగన్‌కు లేఖ రాశారు. కరోనా మహమ్మరి తీవ్రతతో ప్రపంచదేశాలన్నీ తల్లడిల్లుతున్నాయన్నారు. వేలాది మంది మృతి చెందడం, లక్షలాధి మంది బారిన పడటం కనీవీని ఎరుగుని పరిణామమన్నారు. ఇటలీ, స్పెయిల్ తదితర దేశాల్లో రోజుకు వందలాది మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటవరకు ఏదైనా విపత్తు సంభవించినా.. ఏవో కొన్ని జిల్లాలకో, ఏదో ఒక రాష్ట్రానికో స్పష్టం చేసేవి. కానీ కరోనా మహమ్మరీ మాత్రం యావత్ ప్రపంచానికే పెను విపత్తుగా పరిణించిందన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో కోవిడ్ -19 వైరస్ ఇప్పటికే శరవేగంగా విస్తరిస్తుందన్నారు. ప్రాణాంతకంగా మారిన కరోనై వైరస్‌ను ఏవిదంగా నియంత్రించాలనే దానిపై కేంద్రం అనేక మార్గ దర్శకాలు ఇచ్చిందన్నారు. కేవలం లాక్ డౌన్ చేయడంతో... ఆశించిన ప్రయోజనాలు నెరవేరవని, దాంతో పాటు గా పెద్ద ఎత్తు ప్రజారోగ్య చర్యలు యుద్ధ ప్రాంతిపదిక చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సూచించిందన్నారు. వీటిన్నిటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కరోనా వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com