తెలంగాణలో 33కు పెరిగిన కరోనా బాధితుల సంఖ్య

కరోనాపై తెలంగాణ సర్కార్ యుద్ధం ప్రకటించింది.. ఇప్పటికే రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 33కి పెరిగింది. రోజు రోజుకు పరిస్థితి సీరియస్‌గా మారడంతో ఆంక్షలు కఠినతరం చేసింది. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు లైట్ తీసుకుంటుడడంపై రాష్ట్ర సర్కార్ కన్నెర్ర చేస్తోంది. ప్రజలకు సీరియస్ వార్నింగ్ ఇస్తూ.. మొత్తం 23 నిబంధనలను రూపొందించి జాబితాను విడుదల చేసింది. ద్విచక్రవాహనంపై ఒకరు, నాలుగు చక్రాల వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణం చేయరాదని స్పష్టం చేసింది. నిత్యావసర సరకుల కోసం నివాసం నుంచి 3 కిలోమీటర్లు పరిధిలోని దుకాణాలకే వెళ్లాలని సూచించింది. రాత్రి 7గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయటకు రాకూడదని హెచ్చరించింది. అత్యవసర వైద్య చికిత్స కోసం మినహా ఎవరూ బయటకు రాకూడదని.. అలా వస్తే చర్యలు తప్పవని తేల్చి చెప్పింది. సాయంత్రం 6.30గంటల తర్వాత అన్ని దుకాణాలు, సంస్థలు మూసివేయాలని, రాత్రివేళ ఔషధ దుకాణాలు మాత్రమే తెరిచి ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా నియంత్రణ విధుల్లోని వారికి నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. వీటితోపాటు
లాక్ డౌన్ నిబంధనల అమలు కోసం పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది.
ప్రజలు స్వీయ నిర్భందాలు పాటించాలని చెబుతూనే.. కరోనా కరళా నృత్యం చేస్తుండడంతో ఆంక్షలు కఠినంగా అమలు చేయలాని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితిపై ఆరోగ్యశాఖ మంత్రిశాఖ మంత్రి ఈటెల, హోంమంత్రి మహమూద్ అలీ సమీక్షలతో ఎప్పకప్పుడు ఆరా తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com