ఏపీలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ యువకుడు డిశ్చార్జ్
ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇటలీలో MS చదువుతున్న యువకుడు గత వారం నెల్లూరుకు వచ్చాడు. ఆ కుర్రాడికి టెస్ట్‌లు చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఈ నెల 9న ప్రొఫెసర్ నరేంద్ర బృందం చికిత్స చేసింది. రెండు వారాల చికిత్స తరువాత పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని రావడంతో డిశ్చార్జ్ చేశారు.
ప్రస్తుతం యువకుడు కోలుకున్నాడని రిలాక్ష్ అయితే మళ్లీ పరిస్థితి మొదటికొచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆ యువకుడ్ని మరో 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచి మరోసారి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా తొలి పాజిటివ్ కేసు బాధితుడు కోలుకోవడంతో జిల్లా ప్రజలు కాస్త భయాన్ని వీడుతున్నారు.
నెల్లూరు జిల్లాలో కరోనా భయంతో కొందరు ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమైతే.. మరికొందరు అత్యుత్సాహం చూపుతున్నారు. జాతీయ రహరాదిపై వాహనాలు బారులు తీరాయి. దీంతో ఇరువైపులా వాహనాలను పోలీసులు నిలిపివేశారు. అత్యవసర వాహనాలను మినహా ఏ వాహనాన్ని సరిహద్దు దాటనివ్వడంలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com