నేడు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. కరోనావైరస్ వ్యాప్తి వల్ల తలెత్తిన పరిస్థితి, దాన్ని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న ప్రయత్నాలపై మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. "కోవిడ్ -19 యొక్క ప్రమాదానికి సంబంధించిన కీలకమైన అంశాలపై ఈ రోజు రాత్రి 8 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు" అని ప్రధాని మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు.
ప్రజలు తమను తాము సిద్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, భయపడవద్దని ప్రధానమంత్రి క్రమం తప్పకుండా సోషల్ మీడియా ద్వారా ధైర్యం చెబుతున్నారు. ప్రజలు బయటికి వెళ్ళకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన ప్రధాని లాక్డౌన్ సూచనలను పాటించాలని ఆయన ప్రజలను కోరారు. అలాగే లాక్ డౌన్ ను కచ్చితంగా అమలయ్యే చూడాలని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com