ఐటీ రిటర్న్ దాఖలు గడువు పొడిగింపు : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో డెబిట్ కార్డ్ హోల్డర్ల కోసం మరే ఇతర బ్యాంక్ ఎటిఎం నుండి అయినా ఉచితంగా నగదు ఉపసంహరించుకోవ డానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు కనీస బ్యాలెన్స్ మైంటైన్ చేయకుంటే విధించే ఛార్జీలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఆదాయ వివరాల దాఖలుపై లేటు ఫీజును 12 శాతం నుంచి 9 శాతానికి తగ్గించామని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అంతేకాదు 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీని జూన్ 30 వరకూ పొడిగించారు. ప్రస్తుతం ఈ గడువు మార్చి 30 వరకూ ఉంది.
పాన్, ఆధార్ లింకింగ్‌కు డెడ్‌లైన్‌ను కూడా మార్చి 31 నుంచి జూన్ 30 వరకూ పొడిగించారు. కరోనావైరస్ వ్యాధి వ్యాప్తిని తనిఖీ చేయడానికి దేశం లాక్ చేయబడినందున ప్రభుత్వం తీసుకున్న చర్యలు వినియోగదారులకు సహాయపడతాయని ఆమె అన్నారు. ముఖ్యంగా జీఎస్టీ, ప్రత్యక్ష పన్నులు, దివాలా చట్టం అమలుపై కొన్ని కీలక చర్యలు తీసుకుంటామని చెప్పారు. బ్యాంకింగ్, వాణిజ్యం, ఫిషరీస్, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని అన్నారు. జీస్‌టీ రిటర్న్స్‌పై వడ్డీ, లేటు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. రూ 5 కోట్లకు మించిన టర్నోవర్ కలిగిన కంపెనీలకు లేటు ఫీజు ఉండదు..కానీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com